ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఏ.ఎస్.ఎం కళాశాల వద్దగల ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వాణి దంపతుల ఆద్వర్యంలో శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వాణి దంపతులు అయ్యప్ప స్వామి సన్నిదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప నామ స్మరణతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భక్తి పారవశ్యంతో అయ్యప్ప స్వాములు పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలనివేడుకున్నామన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్దిలో ముందుకుసాగాలని, రాష్ట్రం నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ విజయవంతానికి కృషి చేసిన గురుస్వాములు, అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, ముఖ్య నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.


Post A Comment: