ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కాకతీయుల చరిత్ర ఉట్టి పడేలా మెట్ల బావి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.గురువారం మెట్లబావిని ఆయన సందర్శించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ చరిత్ర కలిగిన ఈ మెట్ల బావిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో నిధులు కేటాయించి శిధిలావస్థలో ఉన్న మెట్ల బావి అభివృద్ధి పనులు చేపట్టామని, మరిన్ని నిధులు కేటాయించి మెట్లబావిని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ టూరిజం హబ్ గా మార్చే క్రమంలో నియోజకవర్గంలోని చరిత్ర కలిగిన ఆలయాలను ఆనాటి కట్టడాలను, కాకతీయుల కళావైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అభివృద్ది చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కే.టీ.ఆర్ రాష్ట్రంలోని చరిత్ర కలి
గిన పురాతన మెట్లబావులను అభివృద్ది చేస్తున్నారని, చారిత్రక కలిగిన కట్టడాలను చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా వాటిని అభివృద్ది చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి, డివిజన్ అద్యక్షులు పగడాల సతీష్, డివిజన్ మహిళా అద్యక్షురాలు గోగుల ఇందిర, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: