ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోకు యాక్సిడెంట్ కావడంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూలీలను తీసుకుని వెళ్తున్న ఆటో- కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూలీల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post A Comment: