చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు కొమ్ము లక్ష్మయ్య కుమారుడు కొమ్ము భూపతి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న పీసీసీ సభ్యులు, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చలమల్ల కృష్ణారెడ్డి లింగోజిగూడెం విచ్చేసి భూపతి పార్థీవదేహానికి నివాళు
లర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా
ఉంటానని ధైర్యం చెప్పి, తక్షణ సాయం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు ఊదరి శ్యామ్,బోయ దేవేందర్,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు రాచకొండ భార్గవ్,ఎర్రగోని లింగస్వామి, ఎదుళ్ల అరవింద్ రెడ్డి, కళ్లెం దయాకర్ రెడ్డి, బండమిది వెంకటేష్, బోసి శంకర్,ఎర్రగోని నవీన్,బొంగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: