మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్:పవిత్ర త్రివేణి సంగమం నదుల తీరంలో గత కొద్ది నెలల క్రితం పడవలు చెడిపోవడంతో గంగపుత్రులు రవాణ ప్రయాణం నిలిపివేశారు.దీంతో పర్యాటకుల కేరింతల సందడి చేసే అవకాశం కోల్పోయారు.ఎట్టకేలకు మళ్లీ గంగపుత్రులు అందరూ కలిసి నూతనంగా పడవలు చేయించి,బోటింగ్ ప్రయాణం యధావిధిగా ప్రారంభించడంతో పర్యాటకుల ఆనందోత్సవం,
గంగపుత్రులకు జీవనోపాధి ఆదాయం రానుండడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.రాబోవు సంక్రాంతి సెలవు దినములు కావడంతో వీఐపీలు, భక్తులు,యువతి, యువకులు,పర్యాటకులు అధిక సంఖ్యలో త్రివేణి సంగమం నదులలో పుణ్య స్నానాలు ఆచరించి,బోటింగ్ ప్రయాణ సందడి, ఆలయంలో స్వామివార్ల దర్శనం సందడి నెలకొనే అవకాశాలు ఉన్నాయని, బోటింగ్ ప్రారంభించడంతో పర్యాటకుల సందడి రెట్టింపు అవుతుందని పలువురు స్థానికులు చర్చించుకుంటున్నారు.
Post A Comment: