మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవాలయ అనుబంధ ఆలయం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో,ఈ రోజు దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని, దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ప్రత్యేక పాలాభిషేకం, అలంకరణ,చతుర్వేద సేవలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం గ్రామ సర్పంచ్ వసంత మోహన్ రెడ్డి,ఎంపీటీసీ మమత నాగరాజు,మాజీ సర్పంచ్ మాధవి అశోక్ దంపతులు,మరియు భక్తులు,గ్రామస్తులు,ఆలయ అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: