ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా లోని పౌరులందరూ తప్పని సరిగా ఆధార్ కార్డును నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు.
శుక్రవారం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 5-15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలకు ఆధార్ కేంద్రాల్లో నవీకరణ కోసం ఎలాంటి చార్జీలు ఉండవన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ. అభివృధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునే ఆధార్ నవీకరణ ప్రక్రియ పూర్తీ చేయాలన్నారు. 2016 కంటే ముందు ఈ గుర్తింపు కార్డు పొందిన వారంతా యూఐడిఏఐ ఆదేశాల ప్రకారం సంబంధిత పత్రాలతో ఆధార్ కేంద్రాలను సంప్రదించాలన్నారు. ఈ నవీకరణ ప్రక్రియకు సంబంధించి తగిన చర్యలు తేసుకోవాలని ఆదేశించారు. వివిధ ఉద్యోగాల దరఖాస్తులు , బ్యాంకు ఖాతాలు , ధ్రువ పత్రాలు పొందేందుకు, పలు సేవలు ప్రభుత్వపథకాలైన రేషన్ కార్డు, పెన్షన్, బ్యాంకు సర్వీసులు, సిమ్ కార్డ్స్ , IT-e-Verification , e-KYC మొదలగు ఎన్నోఎన్నో పథకాలకు ఈ డాక్యుమెంట్ అప్డేట్ ఉపయోగ పడుతుందని వివరించారు. లేదంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల అమలులో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తీ చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.ఆధార్ కేంద్రా లను అధికారులు క్రమం తప్ప కుండా తనిఖీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ వాసు చంద్ర, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బి సాంబశివరావు, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీధర్ కలెక్టరేట్ సూపర్ డెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: