మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్ అంబేద్కర్ చౌక్ లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని కుక్క గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సీనియర్ నాయకురాలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత విచ్చేసి దివ్యాంగులందరినీ శాలువాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడుతూ దివ్యాంగులు అనేది కేవలం శరీరానికి తప్ప మనసుకు కాదని మీరందరూ మనోధైర్యంతో ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని అలాగే ప్రభుత్వాలు కూడా దివ్యాంగుల పట్ల చిన్నచూపు చూడకుండా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అంతకుముందు గంగా ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులు పూర్తిగా ఎటువంటి పనిచేయని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారని కావున ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను 6000 రూపాయలను పెంచి ఇవ్వాలని అప్పుడే దివ్యాంగులకు ఆసరాగా ఉంటుందని అలాగే దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో కూడా దివ్యాంగుల కుటుంబాలకు ప్రత్యేక కేటాయింపు ఇవ్వాలని గంగా ప్రసాద్ కోరారు. కార్యక్రమం అనంతరం బిజెపి సీనియర్ నాయకులు కార్మిక సంఘాల నేత కౌశిక హరి కుక్క గంగా ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువాతో సత్కరించారు అనంతరం కౌశిక హరి మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి దివ్యాంగుల హక్కులకై మందకృష్ణ మాదిగ తో కలిసి గంగ ప్రసాద్ పోరాడి దివ్యాంగుల హక్కులను సాధించి పెట్టారని ప్రతి సంవత్సరం కూడా వికలాంగులందరిని ఒకతాటి పైకి తీసుకువచ్చి దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం చాలా అభినందించాల్సిన విషయం అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ కె జాఫర్ , పారుక్ ఖాన్ , తుండ్ల తిరుపతి , మసూద్ , అప్జాల్ , రాజేందర్ , పరుక్ , నరేష్ , గౌస్ , హకీమ్ , నవాబ్ మరియు బిజెపి నాయకులు ధారంగుల కుమార్ , నూనె రాజు , నిమ్మరాజుల రవి , జారుపుల శీను , రాజశేఖర్ , తిరుపతి , లక్ష్మణ్ , గౌతమ్ , శేఖర్ , మురళి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: