ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రాజకీయ పార్టీ ప్రతినిధులు ఓటర్ల నమోదు కు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  వికాస్ రాజ్ కోరారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జాయింట్ సీఈఓ రవికిరణ్, హనుమకొండ కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు   గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిoచారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ  ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్  నమోదు అయ్యేలా  చూడాలి అని అన్నారు. జిల్లాలో ఓటు నమోదు పై   రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం చేయడం  ఇదే తొలిసారి అని అన్నారు. నవంబర్ 9 నుండి  డిసెంబర్ 5,2022   వరకు రాష్ట్ర వ్యాప్తంగా 291,063 ఫారం -6 దరఖాస్తులు రాగా, 38860 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని అన్నారు. అదే విధంగా ఫారం -7 దరఖాస్తులు 80461 స్వీకరించి, 13949డిస్పోజ్ చేయడం జరిగిందని, ఫారం -8 దరఖాస్తులు 57169 దరఖాస్తులు స్వీకరించి 11,948 దరఖాస్తులు డిస్పోజ్ చేయడం జరిగిందని, మిగతా పెండింగ్ దరఖాస్తులు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు.  2 కోట్ల 96లక్షల 145 ఓటర్ లకు గాను ఒక కోటి 69 లక్షల 80వేల 171 మంది 6బి ఫారం ఇచ్చి ఆధార్ లింక్ చేసుకోవడం జరిగిందని, 57.37 శాతం ఆధార్ లింక్ దరఖాస్తులలో 75.39శాతం ఆన్లైన్ ద్వారా, 24.61 ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయిలలో ఓటర్ నమోదు అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రతి ఓటర్ దరఖాస్తుకు ఒక ఫైల్ రూపొందించాలని  ఆదేశించారు. బీ ఎల్ ఓ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, విధులలో ఆలసత్వం  వీడాలని  అన్నారు. పోలింగ్ సెంటర్ లలో  బీ ఎల్ ఓ వివరాలు, సెల్ నెంబర్ తప్పకుండ ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీ లు వ్యక్తం చేసిన  సందేహాలను నివృత్తి చేసి పరిష్కరించడానికి  ఎన్నికల కమిషన్ ఎల్లప్పుడూ సిద్ధం గా ఉంటుందని  అన్నారు.డూప్లికేట్ ఓట్ల ను తొలిగించాలని, ఆధార్ లింకేజీ పూర్తి స్థాయి లో చేయాలనీ, బిఎల్వో లు, బీ. ఎల్. ఏ లు ఓటర్ల కు అందుబాటులో ఉండేవిధంగా  చూడాలని  రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆయన ద్రుష్టి కీ తెచ్చారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, కొత్తగా ఓటర్ నమోదుకు, సవరణలకు గాను ప్రజల అవగాహన కొరకు  విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఇతరుల అభ్యంతరాలను పరిశీలన చేసి తుది జాబితా పకడ్బందీగా రూపొందిస్తున్నా మని  అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో  రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అని అన్నారు జిల్లా లో .467209 మంది ఓటర్లు ఉన్నారని,479 పోలింగ్ స్టేషన్లు, ఉన్నాయి అని కలెక్టర్ తెలిపారు.జిల్లా లో 54.80శాతం  ఆధార్ కార్డు తో అనుసంధానం చేయడం  జరిగింది అని అన్నారు. పట్టణ ప్రాంతంలో ఓటు  నమోదు కు అన్నీ చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకొంటుందని  అన్నారు.స్వీప్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు  తెలిపారు. ఓట్ నమోదు పై రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారులతో క్రమం తప్పకుండ నిర్వహిస్తున్నన్నట్లు వివరించారు.

స్పెషల్ సమ్మరి  రివిసన్ పై  అధికారులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.

ఈ  కార్యక్రమం లో వరంగల్ కలెక్టర్  dr. గోపీ, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, అదనపు  కలెక్టర్ సంధ్యా రాణి dro వాసు చంద్ర,పీడి డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి నాయిని రాజేందర్ రెడ్డి, నిరంజన్, Ev శ్రీనివాస్, బిజెపి పార్టీ నుండి రావు పద్మ, అమరేందర్ రెడ్డి, సిపిఐ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, తెరాస నుండి డాక్టర్ ఇండ్ల నాగేశ్వరావు, రామ్మూర్తి, సిపిఎం నుండి మచ్చ  లక్ష్మణ్, శ్యామ్ సుందర్, పిట్టాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్, హనుమకొండ అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: