మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి పురస్కరించుకొని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భూష్పక సంతోష్ మహారాజ్ అధ్యక్షతన, సిఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూల మాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ అంతర్గం మండల జడ్పిటిసి ఆముల నారాయణ బిజెపి రాష్ట్ర నాయకురాలు 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత టిఆర్ఎస్ పార్టీ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ , హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలను చట్ట సభల వైపు నడిపించాలి... ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయాలని సంకల్పించారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని తపించారు. ఈ రోజు అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి, హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నారు. వర్తమాన సమాజం మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ రచన కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలుసుకోవాలి. స్త్రీ విద్య గురించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి హక్కు కల్పించడం గురించి ఏ విధంగా తన అభిప్రాయాలను చర్చల్లో ఎంత బలంగా వినిపించారో నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ ఆశయాలను అవగాహనపరచుకున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి ఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు పుష్పక ప్రేమ్ కుమార్, సంపత్, సారయ్య, ఎన్ ఎస్ వి రాష్ట్ర నాయకులు జూల రవి, జాగడి సన్నీ, శీను, మధు, ప్రేమ్, రాజేందర్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: