మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని ప్రెస్ మీట్ లో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలోనే హయంలోనే ఆర్ఎఫ్సెలను ఏర్పాటు చేయడం జరిగింది అని, కాంగ్రెస్ పార్టీ 1980 దేశ అవసరాల రీత్యా 750 టన్నుల సామర్థ్యం తో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కాంగ్రెస్ స్థాపించింది.
1999 లో బిజెపి మూసివేసింది.
మళ్ళీ 2004 లో తిరిగి ప్రారంభించిదాని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ యొక్క 10,000 కోట్లు అప్పులను మాఫీ చేసి పైగా 2014 కీ ముందు రామగుండం ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం 600 కోట్లు సమకూరించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. శనివారం ఆర్ ఎఫ్ సి ఎల్ ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి మోడీ ముందుగా కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఏదైతే బాధితులు ఉన్నారో వారికి కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా అంతర్గంలో ఇందిరాగాంధీ హయంలో స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయడం జరిగింది, అది మూత బడిన నుండి ఆ ప్రాంత భూమి అక్రమాలకు గురవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి,కార్పొరేటర్ గాదం విజయ, కార్పొరేటర్ ముస్తఫా, గట్ల రమేష్, ఉరుమెట్లా రాలింగం, పెండ్యాల మహేష్, ఫజల్, దాసరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: