ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

37 వ డివిజన్ దూపకుంట రోడ్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాల/కళాశాల లో ప్రిన్సిపాల్  పేర్న మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మైనార్టీ సంక్షేమ దినోత్సవం & జాతీయ విధ్యా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వరంగల్ ఎమ్మెల్యే  నన్నపునేని నరేందర్ స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేష్, ఆర్. ఎల్. సి డి.శ్రీపాల, డి.ఐ.ఈ.ఓ మాధవరావు లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  మాట్లాడుతూ స్వాతంత్ర్య భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 

 సేవలను గుర్తుకు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ల సంక్షేమం కోసం పనిచేస్తున్నది. మైనారిటీ హాస్టల్స్ కి స్వంత భవనాలు నిర్మాణం కోసం సహకరిస్తాను.

మెడిసిన్, ఐఐటీ లలో సీట్లు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ అభినందనీయం. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి విజయపథంలో ముందుకు సాగాలని, అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. స్థానిక రెసిడెన్సియల్ లో ఫర్నిచర్, ప్రొజెక్టర్, రిఫ్రిజిరేటర్, జనరేటర్  లు వెంటనే మంజూరయ్యే విధంగా చేస్తానని అన్నారు. మరింత విజయవంతం గా మైనారిటీ రెసిడెన్సియల్ విద్యాసంస్థలు ముందుకు సాగాలని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే  చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 

కార్యక్రమం లో  కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ కేడల జనార్ధన్, అర్బన్ యూత్ నాయకుడు మోడెమ్ ప్రవీణ్, టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ సయ్యద్ యాస్మిన్, అఫ్రిన్, రేఖ, ఉజ్మా, నుశ్రత్, డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్, మైనార్టీ నాయకులు ఎం.డి ఉల్ఫత్, పూజారి విజయ్, ఎల్లయ్య, మురళి, అభిషేక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: