ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జనగామ జిల్లా లోని 

పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చేతుల మీదుగా త్వరలోనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభింప చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. అలాగే, కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్ కు కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు వారి సమయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలలో వేర్వేరుగా నిర్వహించిన దళిత బంధు సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా అన్ని స్కూల్స్ ని ప్రైవేట్ కు దీటుగా బాగు చేసేందుకు మన ఊరు, మన బడి, మన బస్తీ, మన బడి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆరువేల కోట్ల వ్యయంతో ఈ పనులు మొదలయ్యాయయని చెప్పారు. అలాగే ప్రపంచ పోటీని తట్టుకునే విధంగా ఆంగ్ల మాధ్యమానికి తెలుగు మీడియం స్కూల్స్ ని మార్చారన్నారు. మరోవైపు అన్ని వర్గాల ప్రజల కోసం గురుకుల పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించారని తెలిపారు. అలాగే, ప్రాథమిక స్థాయి నుంచి వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ జిల్లాకో మెడికల్ కాలేజీని పెట్టి వైద్య రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘతన మన సిఎం దేనని అన్నారు. ఆ విధంగా సిఎం కెసిఆర్ గారు జనగామకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారని, ఇదే క్రమంలో మంజూరైన మహబూబాబాద్ మెడికల్ కాలేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, త్వరలోనే సిఎం కెసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీని, జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభింప చేస్తామన్నారు. ఇదే వరుసలో ఉపాధి, ఉద్యోగాల ద్వారా యువతను ఆదుకోవాలని సిఎం  సంకల్పించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఒకవైపు ప్రైవేట్ రంగంలో పరిశ్రమలను స్థాపింప చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తూనే, ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వేస్తున్నారని మంత్రి వివరించారు. ఇదే వరుసలో కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మినీ టెక్స్ టైల్ పార్క్ ను త్వరలోనే మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి ఎర్రబెల్లి ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 

ఇక దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కెసిఆర్  మన రాష్ట్రంలోనే దళిత బంధు పథకం అమలు చేస్తున్నరాని మంత్రి దయాకర్ రావు తెలిపారు. దళిత బంధు ద్వారా ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయల బద్ధి చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి వివరించారు. మూడేళ్ళల్లో అదరికీ దళిత బంధు లబ్ధి చేకూరేలా చేస్తున్నామని తెలిపారు. అందరికీ ఒకేసారి లబ్ధి చేకూర్చడం సాధ్యం కాదని, దశల వారీగా అందరికీ దళిత బంధు ఫలితాలు అందేలా చేస్తామని చెప్పారు. 

దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్లస్టర్ల వారీగా విభజన చేసి, లాటరీ తీసి, లాటరీలో వచ్చిన క్లస్టర్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులను అందేలా చేయాలని మంత్రి సూచించారు. ఇందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక తర్వాత ప్రభుత్వం నుంచి అందే నిధులను బట్టి వేగంగా వెంట వెంటనే నిధులను దళితులకు అందచేస్తామని మంత్రి వివరించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, దళితులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: