ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో సాధించేది ఏమీ ఉండదని జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు అన్నారు.
శుక్రవారం భూపాలపల్లి మండలం పంబాపూర్ లో అజ్ఞాత మావోయిస్ట్ మచ్చ సోమయ్య కుటుంబ సభ్యులను డిఎస్పీ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకొని, ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా అజ్ఞాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కుటుంబీకులను డిఎస్పీ రాములు కోరారు.
అనంతరం మాట్లాడుతూ, నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి జనజీవనం లోకి వస్తె అన్ని రకాల సహాయం అందిస్తామని, అనారోగ్య సమస్యల బారిన పడిన మావోయిస్టులు అడవిని వీడి లొంగిపోతే వైద్యం అందిస్తామని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో సాధించేదేమీ లేదని, గత 20 సంవత్సరాల నుండి దళంలో ఉన్న మచ్చ సోమయ్య సాధించింది ఏమీ లేదని, అడవిలో ఉంటూ చేసేదేమీ లేదని, ఆయుధాలు వీడి జన జీవం స్రవంతిలోకి రావాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం, పోలీసులు ఉన్నారని ఏలాంటి ఇబ్బందులు ఉన్నా చట్టపరిధిలో పోలీసులు పరిష్కరం చేస్తామని డిఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్సై స్వప్న కుమారి, ఎంపిటీసి ప్రశాంత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: