ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల
శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అక్టోబర్ 27 నుండి 30 తేదీలలో ఇటలీలో జరిగిన ప్రపంచ కరాటే ఛాంపియన్స్ కరాటే కుమితే విభాగంలో మని మార్షల్ అకాడమికి చెందిన మణికంఠ బ్రాంజ్ మెడల్ సాధించారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే మణికంఠను అభినందించి తనకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానన్నాను. అలాగే మని మార్షల్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థి వికాస్ యాదవ్ కరాటేలో రాణించాలని గతంలో ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందించారు. ఏలాంటి పోటీలో పాల్గొన్నా
ఇకపై మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

Post A Comment: