చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
కూసుకుంట్ల గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన చౌటుప్పల్ టిఆర్ఎస్
మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ యూత్ అధ్యక్షుడు తొర్పునూరి నరసింహ గౌడ్ లను టిఆర్ఎస్ నాయకులు గురువారం చౌటుప్పల్ లో ఘనంగా సత్కరించారు. కూసుకుంట్ల
ప్రభాకర్ రెడ్డి గెలుపులో మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులను సమన్వయంతో లక్ష్యం దిశగా నడపడంలో ప్రభాకర్ రెడ్డి, నరసింహ గౌడ్ లు సఫలీకృతులయ్యారని కొనియాడారు. అనునిత్యం పార్టీ పట్ల, కూసుకుంట్ల గెలుపుకు నిబద్ధతతో పనిచేసిన వారిని సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు
కట్కూరి కిరణ్, తొర్పునూరి మల్లేష్ గౌడ్, తిరుమల్ రెడ్డి, బాలగోని గణేష్ గౌడ్, తొర్పునూరి పరమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: