ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ కృష్ణా కాలనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను వరంగల్ నోడల్ అధికారి కె.మాధవరావు బుధవారం సందర్శించారు. విద్యార్థినుల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం నోడల్ అధికారి మాధవరావు మాట్లాడుతూ గత ఏడాది వార్షిక పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చాయని, జిల్లా లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మొదటి స్థానంలో ఉందని అభినందించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థి నులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థినులు వారిని ఆదర్శం గా తీసుకోవాలని సూచించారు. అనంతరం తరగతులు తిరిగి సిలబస్ ఎంతవరకు అయింది. విద్యాబోధన ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. మంచి ఫలితాలు సాధించడానికీ కృషి చేయాలని సూచించారు. నోడల్ అధికారి వెంట ప్రిన్సిపాల్ ఎం. విజయాదేవి, అధ్యాపకులు ఉన్నారు.


Post A Comment: