చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ కి దగ్గర్లో కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 228 గలదాన్ని బోబ్బిళ్ళ కనకయ్య కుమారులు సర్వే నెంబరు 222 నెంబర్ అని తప్పుడు పత్రాలను చూపుతూ ఇట్టి ప్రభుత్వ భూమిలో ఏలాంటి పర్మిషన్ లేకుండా కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇట్టి విషయంలో గతంలో మున్సిపల్ కౌన్సిలర్ల ఫిర్యాదు చేయగా అప్పుడు నిలుపుదల చేసినారు. ఈ మధ్యకాలంలో ఎన్నికల సమయాన్ని అణువుగా చేసుకుని రాత్రికి రాత్రి ఇట్టి స్థలంలో నిర్మాణం చేసినారు. కావున తక్షణమే నిర్మాణం చేసినటువంటి కట్టడాలను కూల్చివేసి,.ఖరీదైన ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని రక్షించాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్ బాబు,కొయ్యడ సైదులు గౌడ్, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కామిశెట్టి శైలజా భాస్కర్, సందగల్ల సతీష్ విజయ, అంతటి విజయ బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.

Post A Comment: