ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా పోలీసులు సమస్యలతో వచ్చే ప్రజలు, బాధితులకు భరోసా కల్పించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 16 ఫిర్యాదులు రాగ, ఫిర్యాదుదారులతో ఎస్పి మాట్లాడి వారి నుండి వినతులు స్వీకరించి, సంబంధిత పోలీసు అధికారులకు చట్ట పరంగా న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Post A Comment: