ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా లోని
జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గుట్టపై కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలిగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి హాజరయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ
సిఎం కెసి ఆర్ ఆశీర్వాదంతో... 100 కోట్లతో పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నం. పాలకుర్తి, వల్మీడీ, బమ్మెరలను ప్రగతి పథంలోకి తెస్తున్నం. గతంలో పాలకులు ఈ దేవాలయాలను పట్టించుకోలేదు.
కేవలం దాతల సాయంతోనే ఈ దేవాలయాలను నడిచేవి.
తెలంగాణ వచ్చాకే, కెసి ఆర్ సిం అయ్యాకే, తెలంగాణ దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చింది.
పాలకుర్తి దేవాలయానికి కూడా సిఎం కెసి ఆర్ నిధులిచ్చి అభివ్రుద్ధి చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ఇందుకు కృషి చేస్తున్నారు.
దక్షిణ భారత దేశంలోనే మూడవ అఖండ జ్యోతిగా పేరు గాంచిన పాలకుర్తి అఖండ దీపోత్సవం.
అరుదైన హరిహర క్షేత్రం. అత్యంత మహిమాన్వితైన దేవాలయం. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఎంతో పవిత్రం ఈ అఖండ దీ పొత్సవం కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వ జన్మ సుకృతం
ప్రజలు సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్న
ఆ స్వాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
కాగా అంతకుముందు ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు.
కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆడపడుచులు వేల సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకు ముందు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు స్వామి వారి వస్త్రాలు బహూకరించారు. ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పుర ప్రముఖులు, ఈ.ఓ రజనీ కుమారి, అర్చకులు, ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Post A Comment: