మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల చౌరస్తాలోని హనుమాన్ టెంపుల్ ఆలయ ప్రాంగణంలో *గోదావరి హారతి ఉత్సవ సమితి అంతర్గాం మండల కన్వీనర్ భూషిపాక సంతోష్ అధ్యక్షతన ఈ నెల 20న అంతర్గం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ ఘాట్ల వద్ద నిర్వహించు గోదావరి మహా హారతి విశిష్టత వివరాలను తెలిపే కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ క్యాతం వెంకటరమణ*హాజరై మాట్లాడుతూ, గోదావరి నది పుణ్య స్నానం జన్మజన్మల పాపాలు తోలగిపోతాయని, నదీమ తల్లికి ధిపారాధన విశిష్టతను గోదావరి నదికి హారతి ప్రత్యేకతను వివరిస్తూ,గోదావరి మహా హారతిని, పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్లారం రామకృష్ణ మరియు అయ్యగారు రామాచార్యులు నేరేడు కొమ్మ నరసింహచార్యులు, కంద లోకనాథం, మాడ ప్రభాకర్ రెడ్డి, చంద్రకళ రాజిరెడ్డి, రాజేందర్, మధు, ఈదునూరి శ్రీమన్, ప్రేమ్ కుమార్, చిలుక జగదీష్, మేడూరి ప్రేమ్, పప్పు శ్రీకాంత్, జుల శ్రీకాంత్, రవి, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: