ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమంలో భాగంగా ఎంజీఎం ఆసుపత్రిలో గల డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో (DEIC) కిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం పిల్లలకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు ప్రారంభించగా 18 ఏళ్ల లోపు పిల్లలకి గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుదీప్ వర్మ వైద్య పరీక్షలు మరియు 2d ఎకో నిర్వహించారు. ఇందులో 145 మందిని పరీక్షించగా 44 మందికి గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. వీరిని శస్ర చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్ కి తరలించనున్నట్లు ఆర్బీఎస్కే జిల్లా సమన్వయకర్త డాక్టర్ గీతా లక్ష్మీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహన్ వెంకట్, డాక్టర్ రోషన్, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రవీందర్, డీఈఐసి మేనేజర్ అనిల్ కుమార్, ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులు, డీఈఐసి సిబ్బంది మరియు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది ప్రశాంత్, కమల్ పాల్గొన్నారు.

Post A Comment: