చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
దత్తతతో చౌటుప్పల్ కి మహర్దశ
రానుంది అని మున్సిపల్ చైర్మన్ వెన్
రెడ్డి రాజు అన్నారు, ఆయన విలేకరుల
సమావేశంలో మాట్లాడుతూ, ఇచ్చిన
మాటకుకాకుండా కట్టుబడ తెలంగాణలో అభివృద్ధికి బాటలు వేసిన సృష్టికర్తలు కేసీఆర్,కేటీఆర్ అని అన్నారు రానున్న రోజుల్లో కేటీఆర్ సహకారంతో చౌటుప్పల అభివృద్ధిలో ఒక దిక్సూచి నిలవబోతోంది,చౌటుప్పల
సమగ్ర అభివృద్ధి కోసం అంచనాలు రూపొందించి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
సహకారంతో కేటీఆర్ కి నివేదించనున్నట్లు తెలిపారు, ఊర చెరువు సుందరీకరణ చెరువు వరదముప్పు నుండి కాపాడేందుకు వరద కాలువ నిర్మాణం పుర వ్యాప్తంగా సిసి రోడ్డు,డ్రైనేజీ పూర్తిస్థాయి నిర్మాణం,ప్రతి శివారు నివాసాలకి కూడా మిషన్ భగీరథ నీటిని అందించడం,డిగ్రీ కళాశాల, గాంధీ పార్కు ఆధునీకరణ నివాసాలపై ఉన్న విద్యుత్తు లైనులను తొలగించడం
లాంటి వివిధ అభివృద్ధి పనులపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు, మార్కెట్,స్మశాన వాటిక,నాగులకుంట సుందరీ కరణ మరో రూ.8 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణం కొనసాగుతుందన్నారు,టి యు ఎఫ్, ఐ డి సి కింద మంజూరైన 20 కోట్లతో ప్రధాన లింకు రోడ్లు సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి టెండర్ దశలో ఉందన్నారు, తంగడపల్లి రోడ్డు పూర్తి కావస్తుందని మరో 10 రోజులలో పనులు పూర్తికాగానే సెంట్రల్ లైటింగ్ పనులు చేపడతామన్నారు,చిన్న కొండూరు రోడ్డు నిర్మాణానికి 18 కోట్లు మంజూరు అయ్యాయి టెండర్ అయిపోయిందని త్వరలో పనులు చేపడతామన్నారు చిన్న కొండూరు రోడ్డు
పూర్తికాగానే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు,

Post A Comment: