మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,పలిమెల:మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని,వనం వీడి జనంలోకి రావాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్) ఆలం అన్నారు.బుధవారం మండలంలోని ముకునూరు గొత్తికోయగూడెం ను పలిమెల ఎస్సై అరుణ్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లిందని,ప్రజలు వాటిని విశ్వసించే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. మావోయిస్టులు ఇకనైనా వనం వీడి జనంలోకి రావాలని,వచ్చి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి సుఖ సంతోషాలతో ఆనందమైన జీవితం గడపాలని పిలుపు నిచ్చారు.గ్రామంలోనికి మావోయిస్టులు,గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.స్థానికంగా మీ అందరికీ ఎలాంటి ఇబ్బందికర సమస్యలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుక వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కాదని ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post A Comment: