ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన పోలీస్ స్టేషన్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే వెంటనే స్టేషన్ ను ప్రారంభించుకోవచ్చు అన్నారు. కార్యక్రమంలో మహాదేవపూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్సై అరుణ్, సిబ్బంది ఉన్నారు.

Post A Comment: