చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక పరిధి బాలాజీ దేవస్థానంలో శనివారం అయ్యప్ప స్వామి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ టిఆర్ఎస్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి నీలిమ దంపతులు అయ్యప్ప మాల ధారణలో ఉన్న స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణలో
ఉన్న స్వాములకు అన్నదానం చేయడం మా పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్లు బాబా షరీఫ్, కొరగొని లింగస్వామి, సుల్తాన్ రాజ్, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, ప్రముఖ వ్యాపారవేత్త మంచి కంటి భాస్కర్ గుప్తా, రామాలయం చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ మున్సిపల్ సహాయ కార్యదర్శి చెవగొని వెంకటేష్ గౌడ్, యువజన నాయకులు తొర్పునూరి నరసింహ గౌడ్, చౌటుప్పల్ మాజీ ఉపసర్పంచ్ అనమోని గోవిందరాజ్, ప్రముఖులు అచ్చిని గణేష్, నాగరాజు, రవి, తడక కిరణ్, ఊడుగు రమేష్ గౌడ్, మల్లేషం చారి, అధిక సంఖ్యలో అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు.

Post A Comment: