ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
కుటుంబ కలహాలతో ఓ ఆర్ఎంపీ భార్యను హత్య చేసిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధి చెన్నారావుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చెన్నారావుపేట మండల పరిధి అమీనాబాద్ కు చెందిన అరుణ ఆశా వర్కర్ గా, భర్త నరేష్ అదే గ్రామంలో ఆర్ ఎంపీగా పని చేస్తున్నారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య అరుణ తన మాట వినడం లేదని కోపోద్రిక్తుడైన నరేష్ హత్య చేశారు. విషయం తెలుసుకున్న
పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఆ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: