ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు.మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతారు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిని సారించడం విశేషంగా చెప్పవచ్చు. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు.
Post A Comment: