మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్షిత మెడిసిన్ లో అత్యుత్తమమైన ర్యాంకు సాధించిన సందర్భంగా అమ్మాయికి ప్రతి నెల మొదటి వారంలో సేవాస్పూర్తి ఫౌండేషన్ తరపున మడిపల్లి మల్లేష్ విద్యార్థినికి 2000 రూపాయలు అందజేశారు ఆ విషయం తెలిసిన డీకే రామయ్య కాలనీకి చెందిన జలీల్ పాషా తండ్రి మహమ్మద్ అంకుష్ రెండవ వర్ధంతి సందర్భంగా సాయి సుదీక్షిత ఇంటికి వెళ్లి సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మహమ్మద్ అంకుస్ మనవరాలు ఎం.డి అంజుమ బిహెచ్ఎంఎస్ చేతుల మీదుగా 2000 రూపాయల చెక్కును సాయి సుదీక్షతకు అందజేయడం జరిగిందని మడిపల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ నేను గత కొంతకాలంగా చేస్తున్న సేవలను గుర్తించి జలీల్ పాషా ఫౌండేషన్ సభ్యులుగా చేరి ప్రతి నెల తనకు తోచిన సహాయం అందిస్తూ ఫౌండేషన్ ముందుకు తీసుకు పోవడంలో ముందుంటున్నందుకు జలీల్ పాషా కు బాధితుల కుటుంబాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం చదువు అయిపోయే వరకు మా వంతుగా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ప్రతి నెల మొదటి వారంలో 2000 రూపాయలు అందజేస్తామని తెలిపారు ప్రతినెలా ఫౌండేషన్కు సహకరిస్తున్న సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ తెలిపారు..
Post A Comment: