ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్
భూపాలపల్లిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. దీంతో జిల్లా లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే...
జిల్లా కేంద్రంలోని రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలోని అటవీ ప్రాంతంలో యువకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బురద గుంటలో పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడిని గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన రావుల సంతోష్ (27)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: