మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్ వలన మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది.. రహస్య సమావేశంలో అవేదన చెందిన గులాబీ కార్పొరేటర్లు.. - ప్రజల ఓట్లతో గెలిచిన మాకు ఆత్మాభిమానం దెబ్బతింటుందని పలువురు గులాబీ కార్పొరేటర్లు అవేదన చెందారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ ఆఫీస్ లోని కార్పొరేటర్లు ఛాంబర్ లో రహస్య సమావేశం జరుపుకొన్నారు. ముఖ్యంగా గెలిచినా నుండి ఇప్పటి వరకు ప్రజలకు సేవా చేసేందుకు మేమున్నా.. కార్పొరేషన్ ఆఫీసులో , క్యాంపు ఆఫీసులో మాకు విలువ దొరకడం లేదంటూ దీని వలన ప్రజాభివృద్ది జరుగడం లేదని అవేదన చెందారు. జనం కోసం ఉన్న మేము డివిజన్ అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్ అధికారులు, మేయర్ స్పందిందిచడం లేదన్నారు. అలాగే దళిత బందు విషయంలో మా డివిజన్ లో దళిత అభివృద్ధి లో మమల్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలువురు కార్పొరేటర్లు సమావేశంలో పలు నిర్ణయాలపై మాట్లాడుకోవడం జరిగింది. ఇలానే ఎమ్మెల్యే, మేయర్ వ్యవహరిస్తే మా ప్రణాళిక మారుతోందని తెలిపారు.
Post A Comment: