ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా కాళేశ్వరం గోదావరి గోదావరి నదిలో ఈతలకు వెళ్ళి శుక్రవారం గల్లంతయ్యారు. హైదరాబాద్ రాంనగర్ కు చెందిన దుర్గామాత భక్తులు మూడు కార్లు.ఒక డిసిఎం వాహనంలో సుమారు నలభై ఐదు మంది భక్తులు దుర్గా మాతను నిమజ్జనం చేసేందుకు కాళేశ్వరం వచ్చారు. దుర్గా మాత నిమజ్జనం కాగానే ఆనందంగా ఈతలు కొట్టడానికి వినోద్,పవన్,దినేష్ లు నది ప్రవాహం లోకి వెళ్లారు. వారు నీటిలో మునుగుతూ మొత్తుకోవడంతో దినేష్ ప్రాణాలతో బయట పడ్డాడు.పవన్,వినోద్ లు పిలవడంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికుడు సమ్మయ్య వారిని కాపాడేందుకు వెళ్లగా వారిలో ఒకరు పట్టుకోవడం తో సమ్మయ్య తాను మునిగి పోతానని భావించారు. వెంటనే వెనుదిరిగి వచ్చారు. దీంతో పవన్ (19),వినోద్ (20)నీటిలో మునిగి గల్లంతయ్యారు. స్థానిక పోలీసులు సంఘటప స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: