ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,సిపి తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు. 


మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ 

మనందరికీ దసరా ముఖ్యమైన పండుగ. 

తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. 

ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. 

తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. 

విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక,

పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు .ఈ సందర్భ0గా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేస్తుంటారు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని చంపి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అదే ప్రస్తుతం మనం జరుపుకుంటున్న విజయదశమి. పురాణ గాథలను బట్టి చెడు పై మంచి సాధించిన విజయం 

ఉర్సుగుట్ట 

రంగ లీలా మైదానంలో ఏళ్ళుగా జరుగుతున్న ఈ రావణ వధ, దసరా ఉత్సవాలకు నేను వస్తూనే ఉన్నాను.

ప్రతి దసరాకి ఇక్కడకు రావడం నా అదృష్టం

మంచిని ఆదరించాలి, చెడు ని ఛీ దరించాలి.

తెలంగాణ సాధనకు స్ఫూర్తి దాయకం. 

ఎన్నో ఆటంకాలను అధిగమించి కెసిఆర్ తెలంగాణ సాధించారు.

తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా కాపాడుతూ, బంగారు తెలంగాణ చేస్తున్నారు.

అభివృద్ధి సంక్షేమం విడనాడకుండా కరోనా కష్ట కాలం లో సైతం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారు.అన్ని రంగాల్లో తెలంగాణ ను దేశంలో అగ్రగామిగా నిలిపినారు.

ఎన్నిక ఏదైనా, గెలుపు మనదే, ప్రజల సంపూర్ణ మద్దతు కూడా బిఆర్ఎస్ కే.

సీఎం కెసీఆర్, వారి కుటుంబం ఆయు ఆరోగ్యాలతో ఉండాలి.

కెసీఆర్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలి.

దసరా పండుగ మనకు అత్యంత ప్రీతికరమైన పండుగ.ఆడ బిడ్డలను, అల్లుండ్లను ఇంటికి పిలిచి బట్టలు పెట్టి, గౌరవించుకోవడం ఈ పండుగ సంప్రదాయం.బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే సరదా పండుగ దసరా.ఈ పండుగ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను

ప్రజలందరి కోరికలు నెరవేరాలని, వారంతా వారివారి పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.మరోసారి ప్రజలందరికీ దసరా విజయదశమి పండుగ శుభాకాంక్షలు

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: