ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ 

జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) కనీస ప్రమాణాలు పాటించాలనీ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ వెంకట రెడ్డి అన్నారు,  గురువారం రోజున కలెక్టరెట్ మినీకాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ,సమీక్షా  సమావేశం జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి అధ్యక్షత జరిగింది,  ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఆశ్రయం పొందుచున్న బాల బాలికలకు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోబోయే చర్యల గురించి వివిధ శాఖల టోల్ ఫ్రీ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు. సెప్టెంబర్ 20 నుండి  26 వరకు  వరకు జిల్లాలోని ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు మరో ఆరుగురు సభ్యులతో   కూడిన కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలియచేసారు. ఈ లోగా ఆయా సంస్థలు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలకు వారి కనీస ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండాలని, లేనిచో ఇన్స్పెక్షన్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రాతిపదికపై తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. 

సంస్థలకు సంబంధించిన భవనాల ఫిట్నెస్,వాటర్ ప్యూరిఫికేశన్,శానిటేషన్ సర్టిఫికెట్స్ సంబంధిత శాఖల నుండి తీసుకొనుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు, జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి మాట్లాడుతూ

సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని 

 హెల్త్ ప్రొఫైల్స్ కు సంబంధించిన ఫార్మాట్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో రూపొందించిన 

 అన్ని సంస్థలు ఒకే విధంగా హెల్త్ ప్రొఫైల్స్ నిర్వహించుటకు సులువుగా ఉండే విధంగా తగు చర్యలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సూచనలతో రూపొందించుకోవాలని  అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బాలల సంరక్షణ కోసం చర్యలు తీసుకావాలని అన్నారు. అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల  అధికారులకు సమాచారం అందించి బాలల సంరక్షణ కేంద్రాల బాల బాలికలకు హెల్త్ ప్రొఫైల్ నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సీహెచ్ అవంతి,

జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి  అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, డాక్టర్ పరికి సుధాకర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక, బాల సదనం సూపరింటెండెంట్ కళ్యాణి, శిశు గృహ ఇన్చార్జి మేనేజర్ ఏ మాధవి, జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సంగి చైతన్య విజయ్ కుమార్, సుజాత,  బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు  తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: