ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆయా ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వత గిరి, అన్నారం, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారం, అమ్మా పురం, తొర్రూరు, నాంచారి మడూరు, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వావిలాల, దర్దేపల్లి, పాలకుర్తి, గూడూరు, వరంగల్ ఉర్సు గుట్ట రంగలీలా మైదానం, పద్మాక్షి గుట్ట లో మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మను ఎత్తుకున్నారు.  అనంతరం ఆయా చోట్ల మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోలాటం కూడా ఆడారు.  మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతూ వారితో మమేకమై మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడటం తో అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడ బిడ్డలకు సద్దుల బతుకమ్మ, దసరా - విజయదశమి శుభాకాంక్షలు! తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ప్రకృతిలో లో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు ఆ పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ అన్నారు. ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే వుంది. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండుగ. కల్వకుంట్ల కవిత  ద్వారానే బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించింది అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి గా నిలిచింది బతుకమ్మ పండుగ. అందుకే సీఎం కెసీఆర్  బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించి నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఅర్ గారు ఆడ బిడ్డలకు పండుగ కానుక గా బతుకమ్మ చీరలు ఇచ్చారు. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే పండుగలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు! అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు.ఈ కార్యక్రమాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: