ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రపంచంలో పూలను ఆరాధించే సంస్కృతి ఒక్క తెలంగాణకే ఉందని  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.సోమవారం  దర్గా రోడ్డు లోని బంధం చెరువు వద్ద  దాదాపు  రెండు  లక్షల 30 వేల రూపాయలతో నిర్మించిన  బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే అతిథి బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆడపడుచులు అందరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసి మెలసి ఆడుకునే పండుగ బతుకమ్మ అన్నారు. ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తం కావడం గర్వంగా ఉందని వెల్లడించారు.

తెలంగాణ పండుగల విశిష్టతను భావితరాలకు అందిస్తూ మన సంస్కృతి, సంప్ర దాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావిణ్య, కుడా చైర్మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, స్ధానిక కార్పొరేటర్ ఏనుగు మానస రాం ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: