ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలకు, ఆడబిడ్డలకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు . స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు. దేవుళ్ళను పూలతో పూజిస్తాం. పూలనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ది అన్నారు. ఆడబిడ్డల కనుల పండుగ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ అని, ఈ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలన్నారు. స్వరాష్ట్రంలో సగౌరవంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయని, తెలంగాణ,వరంగల్ తూర్పు ప్రజలకు, ఆడబిడ్డలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: