ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
చెడుపై విజయానికి ప్రతిక విజయ దశమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు.
విజయ దశమి వేడుకల్లో భాగంగా మంగళ వారం జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆయుధాలకు, వాహనాలకు,
ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విధి నిర్వహణలో పోలీసులకు ఆటంకాలు లేకుండా ఉండాలని, జిల్లా పోలీసు యంత్రాంగం అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు ఉత్తమసేవలు అందించి మంచిపేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు.
అదేవిధంగా ఎస్పీ జిల్లా పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్ లు సతీష్, సంతోష్, ఆర్ ఎస్సై రాజేష్, సాయుధ దళ సిబ్బంది జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: