మహాదేవపురం మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం గ్రామ పరిధిలో గల, ఓ ప్రభుత్వ అక్రమాల ఇసుక క్వారీ నుండి, అధికారులను ముడుపులతో ముసుగేసి అక్రమ వ్యాపారలలో ఆరితేరిన బిల్డింగ్ యజమాని బిల్డర్ కు ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక లీడర్ల సపోర్ట్, సంబంధిత అధికారుల ప్రమోయంతోనే ఈ అక్రమ ఇసుక దందా బిల్డింగ్ యజమానికి నడుస్తుందని పలువురి స్థానికుల ద్వారా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్జాగా అవినీతి అక్రమాలకు పాల్పడడానికి అడ్డాగా పేరుగాంచిన కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని ఓ ప్రభుత్వ క్వారీ నుండి శని ఆదివారాలు సెలవు దినములు కావడంతో, ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు, ఇసుకలోడుతో ఓ టిప్పర్ బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకొని నిర్మాణ కట్టడాలు నిర్మిస్తున్న స్థలంలో ఇసుక డంపులు అన్లోడ్ అయినట్టు పలువురి ద్వారా తెలిసింది, అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను స్థానికులు గమనించి డ్రైవర్ను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. నాకేం తెలియదు డీడీలు, అనుమతి పత్రాలంటు నా దగ్గర ఏమీ లేవు, అంతా మా ఓనర్ నిర్మాణ యజమానితో మాట్లాడడంటూ టిప్పర్ డ్రైవర్ దాటవేసే జవాబు ఇవ్వడంతో, స్థానికులు సంబంధిత ఉన్నత శాఖ అధికారికి సమాచారం చరవాణి ద్వారా తెలపడంతో, వారు తమ కింది స్థాయి అధికారులకు విషయం అందించడంతో, ఆ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్థానికులకు కంటితుడుపు హామీ ఇచ్చినట్లు తెలిసింది...
Post A Comment: