ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా పరకాల ఐ సి డి ఎస్ దామెర మరియు పరకాల మండలాలలో బుధవారం ఘనంగా పోషణ మాసం కార్యక్రమాలు జరిగినవి.ఈ కార్యక్రమాలకు జిల్లా సంక్షేమ అధికారి జయంతి హాజరై , సామాజిక వేడుకల ద్వారా, ప్రవర్తన లో మార్పు తీసుకరావచ్చని, అందుకే అంగన్వాడీ కేంద్రాలలో సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఆరోగ్యదివాస్ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
పోషణ మాసం కార్యక్రమం లో గర్భిణులకు శ్రీమంతాలు నిర్వహించారు, ఐ సి డి ఎస్ పుట్టిల్లు గా పరకాల సిడిపిఓ స్వాతి కి డిడబ్ల్యుఓ జయంతి చేతుల మీదుగా ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దామెర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు లో పాల్గొని అనిమియా తో బాధపడుతున్న కిషోర బాలికలకు, గర్భిణులకు, బాలింతలకు, పోషణ లోపం ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు చేపించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, సిడిపిఓ స్వాతి,పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత, సూపెర్వైసోర్స్ పద్మావతి, రాణి మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
Post A Comment: