తెలంగాణ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రెటేరియేట్ గా పేరును ఖరారు చేస్తూ G.O విడుదల చేసిన సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డా.బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRS పార్టీ అధ్యక్షురాలు *శ్రీమతి గండ్ర జ్యోతి ల్* గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా.బిఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టాలని కోరారు.
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,అనుంబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: