చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికిచెందిన ఊదరి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల
అధ్యక్షునిగా నియమిస్తూ యాదాద్రి
భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్
చైర్మన్ దర్గాయి హరి ప్రసాద్శనివారం నియామకపు ఉత్తర్వులుజారీ చేశారు. అనంతరం నియామకపత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఊదరి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియమాకానికి
సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ
విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నగరికారి
ప్రీతం, జిల్లా అధ్యక్షుడు దర్గాయి
హరిప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు కుంబంఅనిల్ కుమార్
రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి, డాక్టర్ రావుల మాధవరెడ్డి, ఆకులఇంద్రసేనారెడ్డి, బోయ రామచందర్, సుర్వి నరసింహ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీగెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తారనన్నారు.

Post A Comment: