చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్
రెడ్డి గెలుపు తథ్యమని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగారెడ్డిగూడెం గ్రామం శుభం ఫంక్షన్ హాల్ లో 43వ బూత్ సమావేశంశనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణగోని శంకర్, పట్టణ సమన్వయకర్త మోగుదాల
రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ భూస్థాయిలో 60శాతం ఓట్లు సాధించినట్లయితే విజయం
తథ్యమన్నారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా అనుకొని పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలని కోరారు. ఈ సమావేశంలో శక్తి కేంద్రం ఇంచార్జిదాసోజు బిక్షమాచారి, మున్సిపల్ అధ్యక్షుడు ఉడుగు వెంకటేశం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజుశ్రీధర్ బాబు, నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, బొంగురాజు గౌడ్, కందాల వెంకటరెడ్డి,
శివప్రసాద్, బోదుల యాదయ్య, బోదుల ప్రవీణ్, ఊదరి అచ్చయ్య, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి,తొర్పునూరి శ్రీనివాస్, బోదుల మహేష్, ఊదరి రంగయ్య, ఎర్రగోని లింగస్వామి, ఎర్ర గణేష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: