ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. శనివారం మునిసిపల్ కమిషనర్ ప్రవీణ్యా తో కలిసి పద్మక్షమ్మ గుట్ట, సిద్దేశ్వర గుండం, బంధం చెరువు, భీమారం చెరువు, హాసన్ పర్తి చెరువు లను పరిశీలిo చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం శోభా యాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతమైన వాతావరణంలో జరిగేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా
12 చెరువు లలో నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు.ఈ నిమజ్జనం లో 16 క్రేన్ లు,108 సీసీ కెమెరా లు ను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 95 మంది గజ ఈత గాళ్ళు ను సిద్ధం గా ఉంచినట్లు తెలిపారు .
కమిటీ సభ్యులు శోభాయాత్ర , నిమజ్జనం విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసు అధికారుల, రెవిన్యూ అధికారుల సలహాలు, సూచనలను పాటించలని అన్నారు.
మున్సిపల్, పోలీసు అధికారులు సమన్వయం చేసుకుంటూ విగ్రహాల నిమజ్జనోత్సవం కార్యక్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ సరఫరా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా సరఫరా అయ్యేలాచూడాలన్నారు.
నిమజ్జనం జరిగే చెరువు లలో ప్రత్యేక అధికారుల ను నియమించాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ వాసు చంద్ర, ఎంఆర్వో రాజకుమార్ పోలీస్, మున్సిపల్ అధికారులుపాల్గొన్నారు.

Post A Comment: