ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోషణ మాసం సందర్భంగా జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో సమన్వయ సమావేశం హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యరాణి ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమాధికారి
ఎం సబిత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని, 6 నెలల లోపు పిల్లలకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, పిల్లలు (0-5) ఇందు నిమిత్తం సంబంధిత శాఖ అధికారులు తల్లి పాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని,యుక్త వయస్సు బాలికలు , గర్భిణీలు మరియు బాలింతలు సమతుల ఆహరం తీసుకోవాలని గురించి తెలియచేయాలని కోరినారు, సెప్టెంబర్ 1 నుండి 15 వరకు ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ అన్ని అంగన్ వాడి కేంద్రాలలో నిర్వహించాలని , పిల్లలందరి ఎత్తు , బరువు తూచి వారి పెరుగుదల వివరాలు పోషణ్ ట్రాక్ లో అప్ డేట్ చేయాలని, తక్కువ, అతి తక్కువ బరువున్న పిల్లల తల్లులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని , వైద్య అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు . పోషణ మాసం వివరాలు ఇటువంటి సమీక్ష సమావేశాలు , అవగాహన సదస్సులు ద్వారా జిల్లా అధికారులు మరియు మండల అధికారుల ద్వారా ప్రజల వద్దకు సమాచారం చేరుతుందని , పిల్లలు , తల్లులు , బాలింతలు అందరూ సమతుల ఆహరం తీసుకోవాలని సూచించారు
జిల్లా సంక్షేమాధికారి ఎం . సబిత మాట్లాడుతూ పోషణ మాసంలో భాగంగా జిల్లా పరిధిలో అతి తక్కువ బరువున్న పిల్లలకు న్యూట్రిషినల్ రీహబిలిటేషన్ సెంటర్ కి రిఫర్ చేసి వారి పోషణ స్థాయి పెరిగే విధంగా చేస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీ రాములు మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యత తెలియచేయాలని తెలిపారు.
జిల్లాల్లోని 3 ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిధి అంగన్ వాడి కేంద్రాలలో ప్రత్యేక పెరుగుదల , పర్యవేక్షణ డ్రైవ్ , జన చైతన్య కార్యక్రమాలు , కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు న్యూట్రి గార్డెన్ డ్రైవ్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
జెడ్ పి స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ పిట్టల శ్రీలత మాట్లాడుతూ ఐసిడిఎస్ సిడిపివోలు, సూపర్వైజర్లు
అంగన్ వాడి టీచర్లు, మెడికల్ ఆఫీసర్లు కలిసి పోషణ మాసం సందర్భంగా పలు అవగహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో పోషకాహారం , సమతులాహారం పైన మంచి అవగహన తీసుకరావాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసీ శ్రీలత, కల్యాణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివ రావు,జిల్లా అదనపు వైద్యాధికారి మదన్ మోహన్ రావు, ఇమ్యునైజేశన్ అధికారి డాక్టర్ గీతా లక్ష్మి, సిడిపివో లు కే మధురిమ, స్వరూప, భాగ్యలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పోషణ్ అభియాన్ జిల్లా కో కోఆర్డినేటర్ టి సుమలత, మరియు బ్లాక్ లెవెల్ కో ఆర్డినేటర్లు హాజరైనారు .

Post A Comment: