ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి/సుంక శ్రీధర్
పద్మశాలి ముద్దుబిడ్డ, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలగందుల రమణ జన్మదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద జిల్లా పద్మశాలి ప్రధాన కార్యదర్శి అయిల రమేష్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయిల రమేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మశాలి లను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఅర్ రమణకు ఎమ్మెల్సీ పదవి అప్పజెప్పడం శుభ పరిణామం అని, రానున్న రోజుల్లో పద్మశాలిలకు గుర్తించి పద్మశాలి లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే పద్మశాలీలను ఆదుకోవడానికి చేనేత బందును ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పద్మశాలి వృత్తిపై జీవనం సాగిస్తున్న వస్త్ర వ్యాపారులకు సబ్సిడీపై మోపెడ్లు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెగడ చందు, పోపా జిల్లా ప్రధాన కార్యదర్శి సామల రాజేంద్రప్రసాద్, యువజన సంఘం నాయకులు బొల్లి నగేష్, ఆడేపు సదానందం, దూడం లింగమూర్తి, సుంక మహేష్, దూడం ఆంజనేయులు, నల్ల పోచమల్లు, చిలగాని సందీప్, సుంక శ్రీశైలం అడేపు యాదగిరి, యెల్లే వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: