మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి గుర్తింపు ఎన్నికల్లో సిఐటియుని గెలిపించండి!
సిఐటియు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన టి రాజారెడ్డి.
ఎన్టిపిసి టౌన్షిప్ లోని క్వార్టర్ నెంబర్ బి-11/83 లో సిఐటియు ఎన్నికల కార్యాలయాన్ని, సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎన్టిపిసి యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ ఎన్ బిక్షపతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజా రెడ్డి మాట్లాడుతూ ఎన్టిపిసి ఎన్నికల్లో సమరశీల పోరాటాలు చేసే సి ఐ టి యు గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. ఎన్నికల్లో తమ యూనియన్ సహాయక సహకారాలు అందిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్ టి పి సి రామగుండం నుండి నేషనల్ బై-పార్టీఎట్ కమిటీ (ఎన్ బి సి) కి ప్రాతినిథ్యం మరియు స్థానిక గుర్తింపు ఎన్నికలు క్లిష్ట పరిస్థితులలో జరుగుతున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ టి పి సి ని ప్రైవేటీకరణ చేసే పథకంలో భాగంగా పెట్టుబడుల ఉపసంహరణ పేరున 48.89% షేర్లను అమ్మి వేసింది. ఇంకా రెన్యువబుల్ ఎనర్జీ లాంటి హైడ్రో, సోలార్, పవన విద్యుత్ కేంద్రాలను అంబానీ ఆదానిలకు కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నది. మరొక ప్రక్క కార్మిక హక్కులు హరించబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 గంటల మని విధానం అమల్లోకి తెస్తున్నది. అంతేగాక ఫిక్స్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరు మీద కాంట్రాక్టు పద్ధతిన పర్మినెంట్ ఉద్యోగాల నియామకం చేసుకోవడానికి ఎన్ టి పి సి ఉద్యోగుల స్టాండింగ్ ఆర్డర్స్ ని సవరించడం జరిగింది. ఈ విధానాలకు గుర్తింపు యూనియన్ గా ఉన్న ఐ ఎన్ టి యు సి అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ఇక ముందు ఉద్యోగ నియామకాలన్నీ పర్మినెంట్ ఉద్యోగులుగా చేయడం జరగదు. యాజమాన్యానికి తొత్తులుగా మారి కార్మిక హక్కులను తాకట్టు పెడుతున్న యూనియన్లకు బుద్ధి చెప్పాలి. కార్మిక వ్యతిరేక ఈ విధానాలకు వ్యతిరేకంగా స్థానికంగానే గాక దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు సిఐటియు చేస్తుంది. అందుకని తేదీ 19.09.2022న జరిగే గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో సిఐటియు ఎన్నికల గుర్తు స్టార్ పై ఎన్టీపీసీ ఉద్యోగులు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఉద్యోగులకు పిలుపునివ్వడం జరిగింది. ఎన్టిపిసి యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి సారయ్య మాట్లాడుతూ ఇప్పటికీ మద్దూర్ W జీరో గ్రేడ్ ను ప్రవేశపెట్టి కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తుంది. ఉద్యోగంలో చేరి 15 సంవత్సరాలు పూర్తి చేస్తే గాని పి.ఆర్.ఎం.ఎస్ వంటి పథకాలకు అర్హులు కాని పరిస్థితి దాపురించింది. అలాగే ప్రమోషన్లలో కూడా వివక్షతను గురిచేస్తుంది. కావున ఎన్టీపీసీని రక్షించుకోవాలన్నా, ఎన్టీపీసీ ఉద్యోగుల హక్కులు కాపాడబడాలన్న సమరసశీల పోరాటాలు చేసి ఎన్టిపిసి యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ స్టార్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఉద్యోగులకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టిపిసి రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ కామ్రేడ్ గీట్ల లక్ష్మారెడ్డి మరియు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నాంసాని శంకర్ ప్రసంగిస్తూ సిఐటియు యూనియన్ గెలుపుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు కామ్రేడ్ ఈ భూమయ్య ఉపాధ్యక్షులు రామంచి సాంబయ్య, కే నాగేశ్వరరావు, ముఖ్య సలహాదారు కె నరసింహరాజు, కార్యదర్శి రాచపల్లి సంపత్, కోశాధికారి జి బిక్షపతి సిహెచ్ శంకర్ ఐ గణేష్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Post A Comment: