ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజాదివాస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఇవాళ్టి ప్రజా దివాస్ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి 22 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఎస్పి ఆదేశించారు. ప్రజాదివాస్ పెండింగ్ కేసులపై తన కార్యాలయానికి రిపోర్ట్ పంపాలని ఎస్పి ఆదేశించారు.

Post A Comment: