చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తాళ్ల సింగారం గ్రామంలోని 2వ వార్డు బీసీ కాలనీలో ఫిల్టర్ ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం రూ.1లక్ష
ఆర్థిక సాయం అందజేశారు. త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వార్డు ప్రజలు తెలపడంతో వెంటనే స్పందించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం కోసం రూ.1లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బత్తుల స్వామి, బొంగు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: