చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్, మండల
పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు దివిస్ పరిశ్రమ సహకారం రూ.7,07,571లతో నోట్ బుక్స్,స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, షూస్, సాక్స్, హార్లిక్స్ బుధవారం అందజేశారు. ప్రభుత్వపాఠశాలల, నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దివీస్ పరిశ్రమ చేస్తున్న కృషి అభినందనీయమని
ఎస్ఎంసి కమిటీ చైర్మన్ ఎన్ వెంకటేష్ అన్నారు. దివిస్ పరిశ్రమకు పాఠశాలల యాజమాన్యాలుకృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వై.కమలాకర్ రెడ్డి,పి.యాదగిరమ్మ, ది ఇస్ ప్రతినిధులు ఎస్. సాయి కృష్ణ జి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: